Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

అదిగదిగో… సమ్మక్క రాక దృశ్యం

లక్షలాది మంది భక్తులు భక్తిపారవశ్యంతో ఎదురుచూస్తున్న సమ్మక్క తల్లి మేడారానికి బయలుదేరారు. చిలకల గుట్ట నుంచి పూజారులు తోడ్కోని వస్తుండగా సమ్మక్క తాను అధిష్టించే గద్దెవైపు పయనిస్తున్నారు. సమ్మక్క పయనిస్తున్న మార్గంలో లక్షలాది మంది భక్తులు అద్భుత దృశ్యాన్ని వీక్షిస్తున్నారు.

సమ్మక్క తల్లి రాక సూచికగా తుపాకీ కాల్పులు జరుపుతున్న ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్

చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లి రాక సూచికను తెలుపుతూ ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఏకే- 47 తుపాకీలో కాల్పులు జరిపారు. దీంతో తాము ఎదురుచూస్తున్న ఇలవేల్పు రానే వచ్చిందని సమ్మక్క తల్లి భక్తులు భక్తిపారవశ్యంలో ఓలలాడుతున్నారు. తల్లి ప్రయాణిస్తున్న మార్గంలో పొర్లు దండాలు పెడుతున్నారు. మరో గంట వ్యవధిలో సమ్మక్క గద్దెను అధిష్టించవచ్చని అంచనా వేస్తున్నారు.

ఫొటో: చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకువస్తున్న దృశ్యం

Popular Articles