Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

వాగులో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు!

భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆర్టీసీ బస్సు ఒకటి ఈ ఉదయం వాగులో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారం అధికారికంగా ధ్రువపడాల్సి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన వివారాల్లోకి వెడితే… గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామం వద్ద మధ్య మానేరు వాగులో ఆర్టీసీ బస్సు నిన్న చిక్కుకుంది.

కామారెడ్డి నుండి గంభీరావుపేట మీదుగా సిద్దిపేట వెళుతున్న ఈ బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంలో అధికారులు సఫలమయ్యారు. అయితే నీటిలో చిక్కుకున్న బస్సును జేసీబీ సహాయంతో బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రం విఫలమయ్యాయి. కానీ వాగునీటి ఉధృతికి నిన్న చిక్కుకుపోయిన బస్సు ఈ ఉదయం కొట్టుకుపోయినట్లు తెలుస్తున్న సమాచారం రూఢీ కావలసి ఉంది.

ఫొటో: నిన్న వాగునీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

Popular Articles