Top 5 This Week

Related Posts

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 30 మంది వరకు గాయపడ్డారు. హన్మకొండ నుంచి భూపాలపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును శాయంపేట మండలం మాందారిపేట శివారులో ఇసుక లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడినవారిని పరకాల ప్రభుత్వాసుత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Popular Articles