Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

రిచ్ అండ్ పూర్… నువ్వెటు వైపో…? ఇది చదివితే తెలుస్తుంది!

పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలతో పోల్చితే పేదలకు ఇచ్చే ఉచితాల శాతం ఎంత?

బడా పారిశ్రామికవేత్తలకు ప్రతి యేడాది ప్రభుత్వాలు కల్పించే (Incentives) రాయితీలతో పోల్చితే ఈ ఉచితాలు ఎంత?

సబ్బు నుంచి ఉప్పు వరకూ తయారు చేసే పారిశ్రామిక వేత్తలకు తమ ఉత్పత్తిపై మార్కెట్లో ధర నిర్ణయించుకునే అధికారం కల్పించిన ప్రభుత్వాలు రైతు పండించిన పంటకు మార్కెట్లో ధర నిర్ణయించే అధికారాన్ని అదే రైతుకు ఇస్తున్నాయా?

పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే విద్యుత్ చార్జీల రాయితీలతో పోల్చితే, రైతులకు, పేద ప్రజలకు ఇచ్చే విద్యుత్ రాయితీల శాతం ఎంత?

పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలకు ప్రతి యేడాది చేసే ఋణమాఫీతో పోల్చితే రైతులకు, చేనేత కార్మికులకు, పొదుపు చేసుకునే మహిళలకు కల్పించే ఋణమాఫీ శాతం ఎంత?

కార్ల కంపెనీకి పన్నుల్లో (రోడ్డు పెన్నుతో సహా) ఇచ్చే రాయితీ ఎంత? రైతు దగ్గర ఉండే ట్రాక్టరుకు పన్ను రాయితీ ఎంత?

ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న NPAలో పారిశ్రామిక వేత్తలు ఎగ్గొట్టింది ఎంత? సాదా సీదా సామాన్య ప్రజలు ఎగ్గొట్టింది ఎంత?

కొద్దిమంది వినియోగించే విలాసవంతమైన వస్తువులపై పన్ను ఎంత? అత్యధికశాతం ప్రజలు వినియోగించే నిత్యావసరాలపై పన్ను ఎంత?

ఇన్ని రాయితీలు కల్పించిన పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు తిరిగి మార్కెట్లోకి తెచ్చే డబ్బు ఎంత? మార్కెట్లోకి లెక్కలోకి రాకుండా తిరిగే డబ్బు ఎంత?

మార్కెట్ శక్తివంతంగా ఉండేందుకు ఉపయోగపడేది బహిరంగ మార్కెట్లో తిరిగే డబ్బా? లెక్కకు రాని నల్ల ధనమా?

ఇలాంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు, వాటికి జవాబులు తెలుసుకున్నప్పుడు మనం ఎటువైపు ఉన్నామో తెలుస్తుంది. ఎటువైపు ఉండాలో కూడా తెలుస్తుంది.

-దారా గోపి @fb

Popular Articles