ఎల్ఆర్ఎస్ గడువును పొడిగించే అంశంపై తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం కీలక ప్రకటన చేశారు. ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించే ఆలోచనేదీ ఇప్పటికైతే ప్రభుత్వానికి లేదన్నారు. అయితే ఎల్ఆర్ఎస్ పథకంపై ఆశించిన స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో మంత్రి పొంగులేటి మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు.
అక్రమ లై అవుట్ల రిజిస్ట్రేషన్ల అంశంలో పలువురు రిజిస్ట్రార్లు సస్పెన్షన్ కు గురవుతున్నారని, ఈ శాఖ ఉద్యోగులెవరూ ఇబ్బంది పడరాదనే ఎల్ఆర్ఎస్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కాగా భూభారతి చట్టం అమల్లోకి వచ్చారి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయని, సుమారు వెయ్యి మంది సర్వేయర్లను నియమిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.