రక్షాబంధన్ పర్వదిన సందర్భంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖమ్మం మహిళా పోలీసులు రాఖీలు కట్టారు. శనివారం ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో గల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వివిధ వర్గాలకు చెందిన మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ‘మీరు మా సోదరుడు మాత్రమే కాదు, మా కుటుంబాలకు అండ’ అని పలువురు మహిళలు పొంగులేటితో ఈ సందర్భంగా అన్నారు. మంత్రి కూడా వివిధ హోదాల్లో గల మహిళలను, గృహిణులను స్నేహపూర్వకంగా పలకరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుభకార్యక్రమాలకు హాజరైన మంత్రి అక్కడి వేదికల్లో కూడా మహిళలచేత రాఖీలు కట్టించుకున్నారు.

