Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

‘స్థానిక’ ఎన్నికలపై పొంగులేటి కీలక ప్రకటన

స్థానిక ఎన్నికల నిర్వహణపై తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాలవారీగా పార్టీ ముఖ్యులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికల నిర్వహణపై మంత్రి పొంగులేటి చేసిన కామెంట్స్ ఆయన మాటల్లోనే..

  • ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్.
  • రేపటి కేబినెట్ సమావేశంలో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తాం.
  • తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ.
  • అవి పూర్తయిన వెంటనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ.
  • ఆయా గ్రామాల్లో పార్టీ నాయకుల మధ్య సఖ్యత ఉండాలి.
  • నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి.
  • ఎన్నికలకు రావడానికి 15 రోజుల గడువు మాత్రమే ఉంది. కాబట్టి మీ మీ గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం కండి.
  • రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది.
  • ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల దరి చేర్చడం జరిగింది.
  • వచ్చే వారం రోజుల్లోనే అర్హులైన రైతు సోదరులందరికీ కుంట మొదలుకుని ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్ వారి వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుంది.
  • సంక్షేమ పథకాల ఆవశ్యకతను ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే.
  • మీ మీ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు… వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా మీరే చూసుకోవాలి.

Popular Articles