Top 5 This Week

Related Posts

ఎమ్మెల్సీ ఎన్నికల నగారా

తెలంగాణాలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఈమేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈనెల 16న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేష్లను 23న స్వీకరించి, 24వ తేదీన వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 26వ తేదీని చివరి గడువుగా ప్రకటించారు.

మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 17వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. మార్చి 22వ తేదీకల్లా ఈ ఎన్నికల ప్రక్రియను ముగిస్తారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, వరంగల్-ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Popular Articles