Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా

ఢిల్లీ కొత్త సీఎం ఎవరనేది తేలిపోయింది. బీజేఎల్పీ నాయకురాలిగా రేఖా గుప్తాను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. షాలిమార్ బాగ్ నుంచి ఎన్నికైన రేఖా గుప్తా ఢిల్లీకి నాలుగో మహిళా సీఎంగా సేవలందించనున్నారు. గతంలో బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ కు చెందిన షీలా దీక్షిత్, ఆప్ నుంచి అతిశీ ముఖ్యమంత్రులుగా పని చేశారు.

గురువారం రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాంలీలా మైదానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏబీవీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన 50 ఏళ్ల రేఖా గుప్తా తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ, ఆమెకు బీజేపీ అధిష్టానం ఢిల్లీ సీఎం పగ్గాలు అప్పగించడం విశేషం. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Popular Articles