Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

వరంగల్ మార్కెట్ చరిత్రలోనే ‘రికార్డ్’

వరంగల్ వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే తొలిసారి ఓ రికార్డు నమోదైంది. వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో దేశీ రకం మిర్చి రికార్డు స్థాయిలో క్వింటాలుకు రూ. 32 వేలు పలకడం విశేషం. దేశీ రకం మిర్చి ఇక్కడ ఇంత ధర పలకడం మార్కెట్ చరిత్రలోనే ప్రప్రథమంగా వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లికి చెందిన రైతు భిక్షపతి తన మిర్చి పంటను వరంగల్ మార్కెట్ కు విక్రయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రికార్డు స్థాయి ధర పలికిన మిర్చిని పండించిన రైతు భిక్షపతిని వరంగల్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి సన్మానించారు.

Popular Articles