Top 5 This Week

Related Posts

ఖమ్మం జిల్లాలో అరుదైన చోరీ

చోరీల్లో అరుదైన చోరీ ఘటన ఇది. పశువుల దొంగతనం గురించి విన్నాం. ఎడ్లు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, చివరికి కోళ్ల దొంగతనం జరిగిన ఉదంతాలు కూడా అనేకం. కానీ దొంగలు చివరికి పందులను కూడా వదలడం లేదు. పందులకు విలువ లేదని కాదు, ఉంది కాబట్టే దొంగలు పందులపైనా కన్నేశారు. చాకచక్యంగా తస్కరించారు.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చౌటపల్లిలో గత రాత్రి దొంగలు పందుల మందను ఎత్తుకుపోయారు. గ్రామానికి చెందిన గుమ్మడిల్లి భిక్షానికి చెందిన 40 పందులను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. భిక్షానికి చెందిన పందుల కొట్టం నుంచి వాటిని కొంత దూరం తోలుకువెళ్లి అక్కడి నుంచి ట్రాలీ ఎక్కించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటి విలువ రూ. 4.00 లక్షలు ఉండవచ్చని తెలుస్తోంది. పోలీసులు ఈ చోరీ ఘటనపై విచారణ చేస్తున్నారు.

Popular Articles