(సమీక్ష ప్రత్యేకం)
ప్రతిష్టాత్మక నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్ కవర్ పేజీ చిత్రంగా ఒడిషా దట్టమైన అడవుల్లో కనిపించే అరుదైన బ్లాక్ టైగర్ అలంకరించింది. సాధారణ రాయల్ బెంగాల్ టైగర్ జాతిలో జన్యులోపాల వల్ల ఇలాంటి నల్లని పులులు జన్మిస్తాయి. నేషనల్ జియోగ్రఫిక్ అన్వేషకుడు ప్రసేన్ జిత్ యాదవ్ అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని ఈ ఫోటోను తీయగలిగారు.

ఒడిషాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వు అడవుల్లో నాలుగు నెలల పాటు అత్యంత శ్రమకోడ్చి ఈ హై డెఫినిషన్ ఫోటోను తన కెమెరాలో బంధించారు. అయితే ఇటువంటి పులులు ఇంకెన్ని ఉన్నాయో తెలియాల్సి ఉంది. నేషనల్ జియోగ్రఫిక్ మేగజైన్ కవర్ పేజీలో భారతీయ వన్యప్రాణి ఫోటో ప్రచురితమవడం ఇదే మొదటి సారి కావడం విశేషం.
(credit: National Geographic)

