Top 5 This Week

Related Posts

నిజాం మ్యూజియం దొంగకు జీవిత ఖైదు

నిజాం మ్యూజియంలో చోరీకి పాల్పడడమేగాక అనేక కేసుల్లో నిందితుడైన ఓ వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు గురువారం తీర్పును వెలువరించింది. మహ్మద్ గౌస్ అనే వ్యక్తి నిజాం మ్యూజియంలో టిఫిన్ బాక్సు చోరీ కేసులో నిందితుడు. గౌస్ 2018లో నిజాం మ్యూజియంలో విలువైన వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్ బాక్సును చోరీ చేశాడు. అ కేసులో జైలు నుంచి విడుదల అయిన తర్వాత గౌస్ మళ్లీ నేరాలు ప్రారంభించాడు.

రాజేంద్ర నగర్ పరిధిలో 2023లో సవర్ ఖాన్ అనే వ్యక్తిన అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనలో కూడా గౌస్‌ నిందితుడు. ఈ కేసులో గౌస్ ను అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు కోర్టుకు సాక్ష్యాలు సమర్పించారు. ఇతను చేసిన నేరాలను పోలీసులు కోర్టుకు సవివరంగా నివేదించారు. విచారణ జరిపిన కోర్టు గౌస్ కు జీవితఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది.

కాగా జీవిత ఖైదు శిక్ష పడిన గౌస్ పై మొత్తం 18 ఆస్తి చోరీ కేసులు, ఆరు క్రిమినల్ కేసులుండగా, ఇందులో ఓ హత్య, రెండు హత్యాయత్నం, మరో అత్యాచారం కేసు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Popular Articles