Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ఆర్జీవీకి జైలు.. బెయిల్ వీల్లేని అరెస్ట్ వారెంట్

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష పడింది. శిక్ష అమలుకోసం బెయిలుకు వీల్లేని అరెస్టు వారెంట్ కూడా జారీ అయ్యింది. చెక్ బౌన్స్ కేసులో వర్మకు ఈ శిక్ష పడింది. వివరాల్లోకి వెడితే..

హార్డ్ డిస్కులను సరఫరా చేసే ఓ సంస్థకు చెందిన వ్యక్తి 2018లో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు చెందిన కంపెనీపై చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశారు. ఈ కేసులో 2022 ఏప్రిల్ లో ఐదు వేల రూపాయల నగదు పూచీకత్తుతో కోర్టు ఆర్జీవీకి బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణ తర్వాత రాంగోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్షను విధిస్తూ ముంబయి కోర్టు తీర్పునిచ్చింది. జడ్జిమెంట్ వెలువడిననాటి నుంచి మూడు నెలల్లో ఫిర్యాదు దారునికి రూ. 3.72 లకషలు పరిహారం కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

విధించిన శిక్షను అమలు చేసేందుకు రాంగోపాల్ వర్మపై బెయిలుకు వీల్లేని అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. కాగా జడ్జిమెంట్ రోజు రాంగోపాల్ వర్మ కోర్టుకు హాజరు కాలేదు.

Popular Articles