Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ఆర్జీవీ తాజా టార్గెట్ ‘ఆర్నబ్’! ఘాటు వ్యాఖ్యతో మోషన్ పోస్టర్!!

వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కన్ను ఈసారి ప్రముఖ జాతీయ జర్నలిస్టుపై పడింది. రాజకీయ నాయకులను, సినీ తారలను, ఇతరత్రా యదార్థ ఘటనలను తన సినిమా కథలకు ఇతివృత్తంగా ఎంచుకునే రాంగోపాల్ వర్మ రిపబ్లిక్ టీవీ న్యూస్ ఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్టు కమ్ యాంకర్ ఆర్నబ్ గోస్వామిని ‘టార్గెట్’గా చేసుకోవడం విశేషం.

ఆర్నబ్ గోస్వామిపై చిత్రీకరించే సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ ను కూడా రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ‘అర్నబ్… ది న్యూస్ ప్రాస్టిట్యూట్’ టైటిల్ తో మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయడం గమనార్హం. ఇదే దశలో తాను ట్విట్టర్ లో చేసిన ఓ పోస్టులో మాత్రం భిన్నమైన వ్యాఖ్యలు చేయడం మరో విశేషం.

ఓ సాధారణ వేశ్య ఇతరులను అలరించడానికి తన దుస్తులు తొలగిస్తుందని, అయితే అతను తనను తాను అలరించుకోవడానికి ఇతరుల బట్టలు ఊడదీస్తాడు (The difference is a normal prostitute takes off her own clothes to entertain others. whereas,he takes off others clothes to entertain himself) అని ఆర్జీవీ తన ట్విట్టర్ పోస్టులో వ్యాఖ్యానించడం గమనార్హం.

అర్నబ్ గోస్వామిని లక్ష్యంగా చేసుకుని ఆర్జీవీ విడుదల చేసిన ఈ మోషన్ పోస్టర్ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Popular Articles