బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రాసిన లేఖకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురం 107 రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం, ఆవశ్యత గురించి ఎంపీ రవిచంద్ర ఈనెల 7వతేదీన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు లేఖ రాశారు. ఇక్్కడి రైల్వే క్రాసింగ్ కారణంగా తమకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి రామకృష్ణాపురానికి చెందిన పలువురు ప్రముఖులు ఇటీవల ఎంపీ రవిచంద్రను కలిసి వినతిపత్రం ఇవ్వగా, ఈ విషయంపై ఆయన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు లేఖ రాశారు.

ఎంపూీ రవిచంద్ర లేఖకు మంత్రి వెంటనే స్పందించి లేఖ ద్వారా బదులిచ్చారు. రామకృష్ణాపురం గ్రామ సమీపంలోని 107 లెవల్ క్రాసింగ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మించాలనే అంశం తన శాఖ పరిశీలనలో ఉందని చెప్పారున. దీనికి సంబంధించి అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చినట్లు కూడా ఎంపీ రవిచంద్రకు రాసిన లేఖలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. దీంతో రామకృష్ణాపురం, దాని పరిసర గ్రామాల ప్రజలు తమ సంతోషం వ్యక్తం చేస్తూ ఎంపీ వద్దిరాజుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు.
గోఖలే నగర్ ఘటనపై రవిచంద్ర దిగ్భ్రాంతి:
హైదరాబాద్ రామంతపూర్ గోఖలే నగర్‌లో చోటు చేసుకున్న విద్యుత్ షాక్ దుర్ఘటన, ఆరుగురి దుర్మరణంపై రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురికి ప్రభుత్వం మరింత మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఎంపీ రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో చోటుచేసుకోకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవలసిందిగా ఆయన కోరారు.
