Top 5 This Week

Related Posts

కరోనాతో ఐజీ మృతి

కరోనా మహమ్మారి ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని బలి తీసుకుంది. బీహార్ లోని పుర్నియా జోన్ ఐజీగా పనిచేస్తున్న వినోద్ కుమార్ కరోనాతో కన్ను మూశారు. గడచిన మూడు రోజులుగా కరోనా వైరస్ తో పోరాడిన ఐజీ వినోద్ కుమార్ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.

బీహార్ రాష్ట్రంలో కరోనా ఇప్పటికే ఇద్దరు మంత్రులను కూడా పొట్టనబెట్టుకుంది. పంచాయత్ రాజ్ శాఖ మంత్రి కపిల్ డియో కామత్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి వినోద్ కుమార్ సింగ్ ఇటీవల కరోనా బారిన పడి మరణించిన సంగతి తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారం బీహార్ లో ఇప్పటి వరకు దాదాపు వెయ్యి మంది కరోనాకు బలయ్యారు.

Popular Articles