‘దిశ’ పత్రిక యాజమాన్యానికి ఖమ్మానికి చెందిన వ్యాపారవేత్త, న్యాయవాది, వివిధ విద్యా సంస్థల నిర్వాహకుడు డాక్టర్ పులిపాటి ప్రసాద్ లీగల్ నోటీసులు జారీ చేశారు. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా నిరాధార, అసత్య వార్తా కథనాలను ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ, కోటి రూపాయల మొత్తాన్ని నష్ట పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ పులిపాటి ప్రసాద్ తన న్యాయవాది స్వామి రమేష్ కుమార్ ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. ఈమేరకు పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ టి. మోహన్ రావుకు, ఎడిటర్ డి. మార్కండేయకు, ఖమ్మం జిల్లా బ్యూరో ఇంఛార్జి దువ్వా సాగర్ కు పులిపాటి ప్రసాద్ లీగల్ నోటీసులను పంపారు. లేనిపక్షంలో లీగల్, క్రిమినల్ చర్యలకు బాధ్యులవుతారని పులిపాటి ప్రసాద్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. లీగల్ నోటీసు ప్రతిని దిగువన చూడవచ్చు..
‘దిశ’ పేపర్ కు ఖమ్మం వాసి లీగల్ నోటీసులు
