ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవమైన మేడారం మహాజాతర-2026 తేదీలు ఖరారయ్యాయి. ఈమేరకు ఖరారు చేసిన జాతర తేదీలను వెల్లడిస్తూ మేడారం జాతర పూజారుల సంఘం దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు లేఖను అందజేసింది. వచ్చే జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది. జనవరి 28వ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు సారలమ్మ అమ్మవారిని గద్దెకు తీసుకువస్తారు. ఇదేరోజున గోవిందరాజు, పగిడిద్దరాజులను కూడా వారి వారి గద్దెలకు తీసుకువస్తారు. అదేవిధంగా 29వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు సమ్మక్క తల్లిని గద్దెకు తీసుకువస్తారు. ఆ తర్వాత రోజైన జనవరి 30న భక్తులు మొక్కులు సమర్పిస్తారు. జనవరి 31వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు వనదేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు.

