Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

సింగర్ ప్రియాంక, జెడ్పీ సీఈవో, w/o కర్ణణ్, ఖమ్మం కలెక్టర్

సమయం, అవకాశం చిక్కితే ప్రభుత్వ ఉన్నతాధికారులు కొందరు తమలోని కళను ప్రదర్శిస్తుంటారని ఇటీవలే చెప్పుకున్నాం… గుర్తుంది కదా? గణతంత్ర వేడుకల సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయాల్లో నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు తమలోని కళా ప్రతిభను ప్రదర్శించారు. కరీంనగర్ కలెక్టర్ శశాంక పాట పాడడం ద్వారా, సిరిసిల్ల రాజన్న జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ వీణ వాయిద్యంతో తమలోని కళను ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణణ్ సతీమణి, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక తన లోని కళా ప్రతిభను పదర్శించారు. శుక్రవారం నేలకొండలపల్లిలో నిర్వహించిన భక్త రామదాసు జయంత్యుత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రియాంక స్వరార్చన చేశారు. రామదాసు కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. కలెక్టర్ కర్ణణ్ సతీమణి ప్రియాంక గాయకురాలిగా ప్రదర్శించిన ప్రతిభకు అక్కడి శ్రోతలు మంత్ర ముగ్ధులయ్యారు. ప్రియాంక ఆలపించిన రామదాసు కీర్తనల్లోని వీడియోను దిగువన వీక్షించవచ్చు.

Popular Articles