Top 5 This Week

Related Posts

దుబ్బాక ఫలితంపై ప్రధాని మోదీ ‘తెలుగు ట్వీట్’

తెలంగాణా బీజేపీ నాయకుల్లో, శ్రేణుల్లో మరింత జోష్ నింపే విషయమిది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించి అభినందించడం విశేషం. దుబ్బాక ఫలితం చరిత్రాత్మక విజయమని, ‘బీజేపీ ఫర్ తెలంగాణా’కు తమ ఆశీస్సులు అందించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను… అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

రాష్ట్ర అభివృద్ధికై సేవ చేసేందుకు ఇది తమకు మరింత శక్తినిస్తుందన్నారు. దుబ్బాకలో విజయానికి తమ కార్యకర్తలు ఎంతో కృషి చేశారని, బీజేపీ అభివృద్ధి ప్రణాళికను పెంపొందించడంలో కార్యకర్తల కృషిను తాను అభినందిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నిన్న రాత్రి పొద్దుపోయాక చేసిన ఈ ట్వీట్ ను తెలుగులోనే చేయడం మరింత ఆసక్తికరమంటూ బీజేపీ శ్రేణులు సంబరపడిపోతున్నాయి.

Popular Articles