Top 5 This Week

Related Posts

‘సంజయ్’కి ప్రధాని మోదీ ఫోన్

బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఫోన్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని విజయతీరాలకు చేర్చడానికి శ్రమించిన రాష్ట్ర శాఖ కార్యకర్తలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారని బండి సంజయ్‌ చెప్పారు.

నూతన ఉత్సహంతో పార్టీ క్యాడర్‌ నడుచుకోవడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారని కూడా తెలిపారు. దాదాపు పది నిమిషాల పాటు ప్రధాని తనతో మాట్లాడారని, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సరళి, బీజేపీ కార్యకర్తలపై దాడి, రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై ముచ్చటించారని వివరించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రధాని మోదీ సూచించారని కూడా సంజయ్‌ చెప్పారు.

Popular Articles