మణిపూర్ లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ముఖ్యమంత్రి పదవికి బీరెన్ సింగ్ ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. మణిపూర్ లో జాతుల మధ్య ఘర్షణ ఘటనలు, నాలుగు రోజుల క్రితం ఈనెల 9వ తేదీన సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా పరిణామాల్లో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ జరిగిన జాతుల మధ్య ఘర్షణల్లో 250 మందికిపైగా మరణించగా, అనేక మంది నిర్వాసితులయ్యారు.

