Top 5 This Week

Related Posts

ఎన్కౌంటర్ మృతుల్లో ఎస్ఐ

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా భమ్రాగఢ్ తహశీల్ పరిధిలోని కొపార్షి హొదారి అడవుల్లో మావోయిస్టు నక్సలైట్లతో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు పోలీసు సిబ్బంది మృతి చెందగా, అందులో సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఉన్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో ధనాజి హన్నమే అనే ఎస్ఐతోపాటు, కిషోర్ ఆత్రమ్ అనే జవాన్ మరణించినట్లు గడ్చిరోలి ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. రాజు పూసలి, గొంగలు ఓక్సా, దాసరు కుర్సామి అనే జవాన్లు కూడా ఎన్కౌంటర్లో గాయపడినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కాగా దాదాపు 300 మంది మావోయిస్టు నక్సల్స్ ‘అంబుష్’ (మాటు వేయడం) ద్వారా పోలీసులపై అకస్మాత్తుగా విరుచుకుపడినట్లు తెలుస్తోంది.

Popular Articles