హైదరాబాద్: తెలుగు న్యూస్ ఛానల్ N Tv ఆఫీసులో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. మహిళా ఐఏఎస్ అధికారిపై వ్యక్తిత్వ హననంతో కూడిన వార్తా కథనాన్ని ప్రచురించారనే అభియోగంపై ఈ ఛానల్ యాజమాన్యం, ఎడిటర్లు, రిపోర్టర్లు, యాంకర్లపై ఇప్పటికే సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే N Tv తెలంగాణా ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ను, రిపోర్టర్లు పరిపూర్ణాచారిని, సుధీర్ ను గత రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా N Tv ఆపీసులో కొద్దిసేపటి నుంచి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఛానల్ సర్వర్ ను చూపాలని పోలీసులు కోరుతుండగా, వారికి వ్యతిరేకంగా N TV ఆఫీసులోని సిబ్బంది నినదిస్తున్నారు.

