Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

ఛత్తీస్ గఢ్ ఎన్కౌంటర్… దండకారణ్యంలో చెల్లా చెదురుగా పోలీసుల మృత దేహాలు!

ఛత్తీస్ గఢ్ లో శనివారం రాత్రి పొద్దుపోయాక జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరణించిన 17 మంది జవాన్ల మృతదేహాలు అక్కడి అడవుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. నిన్న రాత్రి గల్లంతైన సహచర పోలీసుల కోసం ఈరోజు వరకు కూడా ఛత్తీస్ గఢ్ భద్రతా బలగాలు గాలించాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఎట్టకేలకు చనిపోయిన సహచరుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుక్మా జిల్లా కసల్పాడ్-ఎల్మాగూడ అడవుల్లో మావోయిస్టు నక్సల్స్ మెరుపుదాడిలో 17 మంది పోలీసులు మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకుని రాయపూర్ కు తరలించారు. ఆయా దృశ్యాలను దిగువన చూడవచ్చు.

Popular Articles