హైదరాబాద్: ‘సిరి గోల్డ్’ సంస్థపై అందిన ఫిర్యాదు మేరకు బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావు, సత్తుపల్లి నాయకుడు కూసంపూడి రవీంద్రలు నిందితులుగా హైదరాబాద్ పోలీసులు ఇటీవల నమోదు చేసిన కేసు గురించి తెలిసిందే. ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన యాసా నాగేశ్వర్ రావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైం నెం. 8/2025 ద్వారా ఉప్పల్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
భారతీయ న్యాయ సంహిత చట్టం-2023లోని 316 (2), 318(4) r/w.3(5) సెక్షన్ల కింద, TSPDFE చట్టంలోని సెక్షన్ 5 కింద, Prize Chits and Money Circulation Schemes (Banning) చట్టంలోని 3, 4, 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన బీజేపీ పార్టీలోనేకాదు, రాజకీయంగానూ తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కూసంపూడి రవీంద్ర హైకోర్టును ఆశ్రయించి షరతులతో కూడిన బెయిల్ ను కూడా పొందారు.
ఈ నేపథ్యంలోనే ‘సిరిగోల్డ్’ సంస్థపై వివిధ న్యూస్ ఛానెళ్లు అనేక వార్తా కథనాలను ప్రసారం చేశాయి. ఆయా వార్తా కథనాలకు సంబంధించి న్యూస్ ఛానల్స్ క్రియేట్ చేసిన ‘థంబ్ నెయిల్స్’, వాటి శీర్షికలు ప్రజల్లో చర్చనీయాంశాలుగా మారాయి. యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ఆయా ఛానెల్స్ ‘థంబ్ నెయిల్స్’ ఎలా ఉన్నాయో దిగువన మీరూ చూసేయండి.










