Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

పోలీసుల అదుపులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ పార్టీకి చెందిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా దుబాయ్ లో ఉంటున్న షకీల్ తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకోగానే శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు షకీల్ ను పోలీసులు అనుమతించారు.

ప్రజాభవన్ సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో షకీల్ పై గతంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. షకీల్ కుమారుడు సాహిల్ 2023 డిసెంబర్ 23న కారును వేగంగా నడుపుతూ ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిన ఘటనకు సంబంధించిన కేసులో కుమారున్ని తప్పించేందుకు షకీల్ ప్రయత్నించినట్లు అభియోగాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే పోలీసులు షకీల్ పైనా కేసు నమోదు చేసి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తన తల్లి నిన్న చనిపోవడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు దుబాయ్ నుంచి షకీల్ రాగానే ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీల్ ను పోలీసులు విచారించే అవకాశముంది.

Popular Articles