మల్టీ జోన్-1 పరిధిలో ఎనిమిది మంది సీఐలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వు జారీ చేశారు. ఈ బదిలీల్లో స్థానచలనానికి గురైన పోలీసు అధికారుల్లో ఇటీవల సస్పెండయినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ప్రకటించిన ఇల్లెందు సీఐ బత్తుల సత్యనారాయాణకు కూడా పోస్టింగ్ లభంచడం గమనార్హం. సత్యనారాయణపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ తాజాగా పోస్టింగ్ ఇచ్చారు. వివరాల్లోకి వెడితే..
వెయిటింగ్ లో గల కన్నం కుమారస్వామిని కాగజ్ నగర్ రూరల్ కు, టేకుపల్లిలో గల తాటిపాముల సురేష్ ను ఇల్లెందుకు, ఇల్లెందు నుంచి బత్తుల సత్యనారాయణను టేకులపల్లికి, కౌటాలలో గల ముత్యం రమేష్ ను వెంకటాపురానికి బదిలీ చేస్తూ, ఇక్కడ గల బండారి కుమార్ ను ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా వెయిటింగ్ లో గల పి. దయాకర్ ను డిప్యుటేషన్ ను రద్దు చేస్తూ ములుగు జిల్లా పస్రాకు బదిలీ చేశారు. ఇక్కడ గల గద్దె రవీందర్ ను ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వెయిటింగ్ లో గల కోమల్ల నాగరాజును సీసీఎస్ మెదక్ కు బదిలీ చేశారు.
