Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

ప్రధాని ముందు RayBan అద్దాల కలెక్టర్.. జీతం ఒక్క రూపాయి!

(సమీక్ష ప్రత్యేకం)
పదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ పర్యటన సందర్భంగా చలువ కళ్లద్దాలతో స్వాగతం ఈ IAS అధికారి గుర్తున్నారా? మోదీ బస్తర్ జిల్లా అధికార కార్యక్రమంలో కలెక్టర్ గా ఉన్న అమిత్ కటారియా అనే ఈ అధికారి తనను తాను పరిచయం చేసుకునే సమయంలో RayBan కళ్లద్దాలు ధరించారు. ఉద్యోగ నిబంధనలకు ఇది విరుద్దమని అప్పట్లో చీఫ్ సెక్రటరీ ఆయనకు నోటీసు కూడా ఇచ్చారు. దానిపై ఆయన ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా ఉండటంతో సమస్య సమసిపోయింది.

అమిత్ కటారియాకు ఇంకో ప్రత్యేకత ఉంది. 2004 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన ఈయన ఉద్యోగంలో చేరినప్పుటి నుంచి నెల జీతం రూ. 1 మాత్రమే తీసుకుంటున్నారు. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను కూడా పెద్దగా ఉపయోగించుకోరు. ఛత్తీస్ గఢ్ క్యాడర్ కు చెందిన కటారియా ప్రస్తుతం హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన సతీమణి Asmita Handa కమర్షియల్ పైలట్. హర్యాణా రాష్ట్రం గురుగ్రామ్ కు చెందిన కటారియా కుటుంబానికి స్థిరాస్థి వ్యాపారం ఉంది. ఆయన సొంత ఆస్తి రూ.10 కోట్లు అని ఉద్యోగంలో చేరేటప్పుడు ప్రకటించారు.

ఉమ్మడి కుటుంబం, అపారమైన ఆస్తులున్న నేపథ్యంలో ఆయన రూపాయి జీతం నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ IITలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన కటారియా 2003 సివిల్స్ పరీక్షల్లో 18వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కు ఎంపికయ్యారు. చిన్నప్పటి నుంచి అణకువ, సేవాభావంతో పెరిగిన ఆయన తన వృత్తి జీవితంలో కూడా నిజమైన సేవకుడిగా పనిచేస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్నారు.

Popular Articles