Top 5 This Week

Related Posts

కానిస్టేబుల్ ను చంపిన రియాజ్ అరెస్ట్

నిజామాబాద్: సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా హత్య చేసిన పాత నేరస్థుడు రియాజ్ ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిజామాబాద్ నగరంలో శుక్రవారం అరెస్ట్ చేసి కానిస్టేబుల్ ప్రమోద్ బైకుపై తీసుకువస్తున్న సందర్బంగా రియాజ్ కత్తితో అతన్ని పొడిచి చంపిన సంగతి తెలిసిందే. ఘటనానంతరం రియాజ్ పరారయ్యాడు. ఈ ఘటనపై డీజీపీ శివధర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రియాజ్ ను వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నిజామాబాద్ కు పంపించారు.

ఈ నేపథ్యంలోనే రియాజ్ కోసం పోలీసులు తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలోని 6వ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సారంగాపూర్ శివారులోని ఓ షెడ్డులో రియాజ్ షెల్టర్ తీసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే పోలీసులను చూసిన రియాజ్ పారిపోయేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్న మరో వ్యక్తిని కూడా గాయపర్చాడు. పోలీసులు అప్రమత్తమై రియాజ్ ను రౌండప్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు రియాజ్ ను అరెస్ట్ చేసినప్పటి చిత్రం

కాగా రియాజ్ ఎన్కౌంటర్ కు గురయ్యారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య క్లారిటీ ఇచ్చారు. రియాజ్ పై తాము ఎటువంటి కాల్పులు జరపలేదన్నారు. రియాజ్ ను ప్రాణాలతో పట్టుకున్నట్లు చెప్పారు. కాగా గాయపడినట్లు తెలుస్తున్న రియాజ్ ను ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులు చికిత్స అందిస్తున్నారు.

Popular Articles