పార్టీ కండువా మార్చిన ఎమ్మెల్యేలకు తెలంగాణా అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు వేర్వేరు సందర్భాల్లో కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ కండువాను కప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంలో బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ ఆధారంగా అసెంబ్లీ కార్యదర్శి నోటీలు పంపారు. అయితే వివరణ ఇవ్వడానికి తమకు వ్యవధి కావాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలు కోరడం గమనార్హం.

