Top 5 This Week

Related Posts

‘కేసీఆర్, కేటీఆర్’లపై అర్వింద్ సంచలన ట్వీట్

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ పై నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నాయకుడు ధర్మపురి అర్వింద్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఎంఐెఎం పార్టీ విషయంలో కేసీఆర్, కేటీఆర్ లు వేర్వేరు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల వీడియోలతో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, ‘ఈ ఛోటే-బడే మియాలను చూస్తే ఊసరవెళ్లి కూడా సిగ్గుతో రంగు మార్చుకోవడం మానేస్తదేమో…?! అని సందేహిస్తూ వ్యాఖ్య చేశారు. ఆయా ట్విట్టర్ పోస్ట్ ను దిగువన చూడవచ్చు.

Popular Articles