న్యూ ఇయర్ అంటే క్యాలెండర్ మారడమే కాదు…
మన మాటలు, మన నిర్ణయాలు, మన ఆశలు కూడా
రిసెట్ బటన్ నొక్కినట్టే మారిపోతాయి.
డిసెంబరు 31 రాత్రి మనం చేసే ఘాటు ప్రతిజ్ఞలు చూస్తే,
మనకు మనమే ఓ రాజకీయ నాయకుడిలా అనిపిస్తాం!
“ఈ ఏడాది నుంచే టైమ్‌కు నిద్ర”
“ఈసారి పొదుపు తప్పనిసరి”
“ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ”
“రోజూ గంటైనా మెడిటేషన్ “
“భగవద్భక్తి, పెందలాడే లేచేయాలి”
“పూజా సమయం పెంచుకోవాలి”
అంటూ గంభీరంగా ప్రకటిస్తాం.
కానీ జనవరి మొదటి వారానికే…
ఆ ప్రతిజ్ఞలు వాట్సాప్ స్టేటస్‌లా
24 గంటల్లో మాయమైపోతాయి!
న్యూ ఇయర్ రోజున జిమ్‌లు ఫుల్,
ఫిబ్రవరి వచ్చేసరికి అక్కడ
ట్రెడ్‌మిల్ సైతం జాలిగా నవ్వుతూ
మన కాళ్ళకింద ఇంచ్ కూడా కదలదు!
డైట్ ప్లాన్‌లు మాత్రం సీరియస్ గా ఉంటాయి…
కానీ…స్వీట్స్ చూసీ.. చూడంగానే సెలవు తీసుకుంటాయి.
అయినా న్యూ ఇయర్‌లో ఉన్న అందం అదే.
మన లోపాలను నవ్వుకుంటూ అంగీకరించడం,
మళ్లీ ప్రయత్నించాలనే ధైర్యం తెచ్చుకోవడం.
పాత తప్పుల్ని మోసుకుంటూనే,
కొత్త ఆశల్ని భుజాన వేసుకుని ముందుకు నడవడం.
నిజానికి న్యూ ఇయర్
మనల్ని సంపూర్ణుల్ని చేయదు…
కానీ
“ఇంకోసారి ట్రై చేద్దాం”
అనే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది.
అందుకే —
ఈ న్యూ ఇయర్‌లో
డైట్ కుదరకపోయినా పర్వాలేదు,
వాకింగ్ మిస్సయినా పర్వాలేదు,
కానీ
నవ్వడం మాత్రం మర్చిపోవద్దేం! 😄
ఇదే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అసలైన సూత్రం! 🎊
అందరికీ ఆనందకరమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు
✍️ డాక్టర్ ఎమ్మెస్వీ సత్యనారాయణ బాబు (కపర్ది)

