Top 5 This Week

Related Posts

పోలీస్ క్యాంపుపై నక్సల్స్ మెరుపు దాడి: జవాన్ మృతి

పొరుగున గల ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టు పార్టీ నక్సలైట్లు పేట్రేగిపోయారు. తీవ్రవాద ప్రభావం గల కడెమెటాలో గల పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో ఆర్ముడ్ రిజర్వు ఫోర్స్ విభాగానికి చెందిన జవాన్ ఒకరు మరణించారు.

కడెమెటా పోలీస్ క్యాంపుపై నక్సల్స్ అకస్మాత్తుగా దాడి చేశారని, అయితే తేరుకున్న తమ పోలీసులు వారిని ప్రతిఘటించడంతో పారిపోయారని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ మీడియాకు చెప్పారు. నక్సలైట్ల కోసం గాలింపు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

Popular Articles