Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

పోలీస్ స్టేషన్ పై రాకెట్ లాంఛర్లతో నక్సల్స్ దాడి

మహారాష్ట్రలో మావోయిస్టులు ఓ పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. రాకెట్ లాంఛర్లతో నక్సలైట్లు పోలీస్ స్టేషన్ పై దాడి చేయడం గమనార్హం. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా గట్టా పోలీస్ స్టేషన్ పై నక్సలైట్లు రాకెట్ లాంఛర్లతో దాడి చేశారు. నక్సల్స్ ప్రయోగించిన రాకెట్ లాంఛర్ పోలీస్ స్టేషన్ సెంట్రీ రూంకు తగిలి రంధ్రం ఏర్పడింది. అయితే ఈ సంఘటనలో ఎటువంటి ప్రమాదంగాని, ప్రాణనష్టంగాని జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నక్సలైట్లు ఉపయోగించిన రాకెట్ లాంఛర్ శకలాలపై పోలీసు వర్గాలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. పరిమాణాన్ని బట్టి హ్యాండ్ మేడ్ లాంఛర్లుగా అనుమానిస్తున్నారు. కాగా ఛత్తీస్ గఢ్ లోని దండకారణ్యంలో పోలీసులు తమపై డ్రోన్ల ద్వారా పోలీసులు బాంబు దాడులు చేస్తున్నారని మావోయిస్టులు ఆరోపిస్తున్న నేపథ్యంలోనే గడ్చిరోలి జిల్లాలోని ఠాణాపై రాకెట్ లాంఛర్ల దాడి జరగడం గమనార్హం.

స్టేషన్ సెంట్రీ గదికి రంధ్రం పడిన దృశ్యం

Popular Articles