Top 5 This Week

Related Posts

అవినీతి ఎమ్మార్వోకు జైలు శిక్ష, జరిమానా

హైదరాబాద్: అవినీతికి పాల్పడిన కేసులో నల్లగొండ జిల్లాకు చెందిన తహశీల్దర్ సీహెచ్. శ్రీనివాసరాజు అలియాస్ శ్రీనివాస్ కు ఏడాది కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 25 వేల జరిమానా విధిస్తూ హైదరాబాద్ ఏసీబీ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో నెల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని కోర్టు వెల్లడించింది.

నల్లగొండ జిల్లా తిరుమలగిరి తహశీల్దార్ గా పనిచేస్తూ 2011 డిసెంబర్ 30వ తేదీన తహశీల్దార్ చక్రహరి శ్రీనివాసరాజు అలియాస్ శ్రీనివాస్ ఏసీబీకి చిక్కారు. వ్యవసాయ భూమిని మ్యుటేషన్ చేసేందుకు ఫిర్యాదుదారు నుంచి రూ. లక్ష మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తూ తహశీల్దార్ శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కేసు దర్యాప్తు అనంతరం ఏసీబీ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసులో వాద, ప్రతివాదనలు ముగిసిన అనంతరం తహశీల్దార్ శ్రీనివాసరావును దోషిగా నిర్ధారిస్తూ అతనికి హైదరాబాద్ ఏసీబీ కోర్టు మొదటి అదనపు స్పెషల్ జడ్జి ఏడాది కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 25 వేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు.

Popular Articles