పోక్సో కేసులో దోషిగా తేలిన నిందితునికి 50 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన అభియోగంపై మహ్మద్ ఖయ్యూమ్ అనే వ్యక్తిపై 2021లో నల్లగొండ జిల్లా తిప్పర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో వాద, ప్రతివాదనలు ముగిసిన అనంతరం నిందితుడైన ఖయ్యూమ్ ను పోక్సో కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈమేరకు మహ్మద్ ఖయ్యూమ్ కు యాభై ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు ఇంఛార్జి జడ్జి రోజారమణి మంగళవారం తీర్పును వెలువరించారు.
