Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

నల్గొండ కోర్టు సంచలన తీర్పు

దళిత యువతిపై అత్యాచారం కేసులో నల్గొండ కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. దళిత యువతిని పెళ్లి పేరుతో నమ్మించి అత్యాచారం చేసిన ఘటనలో నిందితునికి మొత్తం 27 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ నల్గొండ అదనపు సెషన్స్ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పును వెలువరించింది. ఒకే కేసులో వివిధ అంశాల్లో రుజువైన నేరం ఆధారంగా దోషికి శిక్షను ఖరారు చేసింది.

పెళ్లిపేరుతో నమ్మించి అత్యాచార చేసినందుకు పదేళ్ల జైలు, రూ. వెయ్యి జరిమానా, అదేవిధంగా దళిత యువతిని మోసగించినందుకు మరో పదేళ్ల జైలు శిక్ష, పెళ్లి పేరుతో మోసగించినందుకు మరో ఏడేళ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానాను విధిస్తూ జిల్లా అదనపు ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి తీర్పునిచ్చారు.

Popular Articles