Top 5 This Week

Related Posts

ఖమ్మంలో ‘మున్నేరు’ వరద దృశ్యాలు

ఖమ్మం: ఖమ్మం నగరంలోని లోతట్టు ప్రాంతాలను మున్నేరు నది వరద నీరు చుట్టుముట్టింది. మున్నేరు వరద నీటి ప్రవాహం గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో 25 అడుగులకు చేరింది. మరో మూడు అడుగుల వరకు వరద ప్రవాహం పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఖమ్మం నగరంలోని లోతట్టు ప్రాంతాలైన మోదీనగర్, బొక్కలగడ్డ తదవితర ప్రాంతాల్లోకి మున్నేరు వరద నీరు చేరింది. ఈ ప్రాంతాలకు చెందిన సుమారు 100 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎగువన గల ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం నగరం నడిబొడ్డు నుంచి ప్రవహించే మున్నేరుకు వరద పోటెత్తుతోంది. వరదకు సంబంధించిన తాజా దృశ్యాలను దిగువన చూడవచ్చు..

Popular Articles