Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా: ఇదీ పూర్తి షెడ్యూల్

హైదరాబాద్: తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కోడ్ కూడా అమలులోకి వచ్చింది. ఇవీ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు:

  • నామినేషన్ల దాఖలు ప్రారంభం: జనవరి 28
  • నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: జనవరి 30
  • నామినేషన్ల పరిశీలన: జనవరి 31
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు: ఫిబ్రవరి 3
  • పోలింగ్ తేది: ఫిబ్రవరి 11
  • రీ పోలింగ్ తేది: ఫిబ్రవరి 12
  • ఓట్ల లెక్కింపు: ఫిబ్రవరి 13
  • మున్సిపల్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక తేది: ఫిబ్రవరి 16
  • మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక: ఫిబ్రవరి 16

Popular Articles