Top 5 This Week

Related Posts

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వినతి

న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా,జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని బీఆర్ఎస్ పార్లమెంటరీపార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కలిశారు. తెలంగాణాలో పెండింగ్ లో గల పలు జాతీయ రహదారులకు నిధులు కేటాయించాలని కోరారు. అదేవిధంగా నిర్మాణ దశలో ఉన్నటువంటి రహదారుల పనులను తక్షణమే పూర్తి చేయాలని అభ్యర్థించారు. ఈమేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆయన ఛాంబర్ లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గురువారం కలిసి వినతి పత్రాన్ని అందించారు. రవిచంద్ర అభ్యర్థనపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూల స్పందనను తెలిపారు.

Popular Articles