మన దేశంలో మేజర్ మినరల్స్ కంటే మైనర్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. దేశంలో 2,000 కన్నా తక్కువ మేజర్ మినరల్ మైన్స్ ఉండగా, 60,000 పైగా మైనర్ మినరల్ మైన్స్ ఉన్నట్లు చెప్పారు. ఇవి 30 మిలియన్ల మందికి పైగా ప్రజల జీవనోపాధిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు. గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ -2025 బిల్లును బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర ఖనిజాల అంశానికి సంబంధించి కీలక ప్రసంగం చేశారు.
ముప్పయి మిలియన్ల ప్రజలకు పైగా ఉపాధినిస్తున్న ఆయా మైన్లు అధిక నియంత్రణలో, గుర్తింపు తక్కువగా, పాతకాలపు విధానాలలో ఇరుక్కుపోయాయని పేర్కొన్నారు. ప్రపంచ రాజకీయాలు, జియోపాలిటిక్స్ కూడా ఇప్పుడు మినరల్స్ చుట్టూ తిరుగుతున్నాయని, మన దేశానికి ఉన్న జియోలాజికల్ పొటెన్షియల్‌ను ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా వెలికితీయకపోతే, మనం ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించలేమని ఎంపీ రవిచంద్ర అభిప్రాయపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పదేళ్ల పాలనలో గ్రానైట్ ఇండస్ట్రీని కాపాడే విధంగా ఎన్నో సంస్కరణలు అమలు చేశారని ఎంపీ వద్దిరాజు వివరించారు. స్లాబ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసి ఫ్యాక్టరీలను ఆదుకున్నారని చెప్పారు.

ప్రస్తుతం 515 మేజర్ మినరల్ బ్లాక్స్ వేలంలో పెట్టారని, అందులో 12% మాత్రమే ఆపరేషనల్ అయ్యాయని, మైనర్ మినరల్స్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉందన్నారు. ఎక్స్ప్లోర్ చేయని బ్లాక్స్‌ని కూడా ఆక్షన్‌లో పెడుతున్నారన్నారు. ఇది కార్టెల్ లావాదేవీలు, గనులు మూసివేత, ఇన్వెస్టర్ల వెనుదిరుగుదలకు దారి తీస్తున్నదని రవిచంద్ర చెప్పారు. ఈ సందర్భంగా తాను కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయదలచుకున్నట్లు పేర్కొన్నారు.
వేలం రిజర్వ్ చేయాలంటే, సరైన ఎక్స్ప్లోరేషన్ అయిన పెద్ద బ్లాక్స్‌నే పెట్టాలని, 10 హెక్టార్ల లోపు లీజులకు First-Come-First-Serve విధానం కొనసాగించాలన్నారు. అదేవిధంగా లీజ్ హోల్డర్స్ లిథియా కోబాల్ట్ గ్రానైట్ వంటి ముఖ్యమైన ఖనిజాలను అదనపు రాయల్టీ లేకుండా చేర్చుకోవాలని ఎంపీ రవిచంద్ర సూచించారు.దీనివల్ల భూవినియోగం సమర్థవంతమవుతుందని, ఉద్యోగ అవకాశాలు ఇంకా పెరుగుతాయన్నారు. మినరల్ ఎక్స్చేంజీల ఏర్పాటు ద్వారా న్యాయమైన ధరలు, మధ్యవర్తుల దోపిడీ తగ్గడం, స్థిరమైన మార్కెట్ సాధ్యమవుతుందని చెప్పారు.

అదేవిధంగా మైనర్ మినరల్ పన్నులు 200% నుంచి 450% వరకు ఉన్నాయని, అక్రమ ట్రేడ్‌కి కారణమవుతున్నదని, “One Nation, One Mineral, One Tax” మోడల్ అమలు చేస్తే బాగుంటుందని ఎంపీ రవిచంద్ర సలహా ఇచ్చారు. టాక్స్ రేట్లు, రెవెన్యూ న్యూట్రల్‌గా ఉంచాలన్నారు.
మేజర్ మినరల్స్‌పై 2% DMET వసూలు చేసేవారు, ఇప్పుడు 3% పెంచారన్నారు. తెలంగాణలో మైనర్ మినరల్స్‌పై 2% SMET వసూలు చేస్తున్నారని, కానీ వసూలైన డబ్బు బ్యాంక్ అకౌంట్లలోనే ఉందని, అభివృద్ధి పనులకు వినియోగించడంలేదని ఎంపీ వద్దిరాజు తెలిపారు. వాస్తవానికి DMET, SMET ద్వారా వసూలైన మొత్తం ఎంత? అందులో ఎంత శాతం నూతన ఎక్స్ప్లోరేషన్, సర్వేలకు వినియోగిస్తున్నారని ఎంపీ రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కొత్తగా ప్రతిపాదిస్తున్న DMET ద్వారా అభివృద్ధి పనులపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఉండాలని ఎంపీ రవిచంద్ర సూచించారు. గ్రానైట్ ఇండస్ట్రీ కొన్ని లక్షల మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని చెబుతూ, లీజ్ పీరియడ్ ఒకసారి మైన్ గ్రాంటింగ్ ఇచ్చినచో EC పూర్తి కాలం ఉండాలని, 0 నుండి 5 హెక్టార్ల వరకు B2 కేటగిరీలో వస్తే, పబ్లిక్ హియరింగ్ అవసరం లేదని ఎంపీ రవిచంద్ర చెప్పారు. కేవలం అప్లికేషన్, EMP రిపోర్ట్, REIAA స్క్రూటిని చేసి 15 రోజుల్లోనే అనుమతులివ్వాలని కోరారు. అదేవిధంగా 5 నుండి 25 హెక్టార్ల వరకు కూడా ఇదే విధానం, గరిష్టంగా 15 రోజులు, 25 నుండి 100 హెక్టార్ల వరకు B1 కేటగిరీ – పబ్లిక్ హియరింగ్ తప్పనిసరి, MoEF నిబంధనల ప్రకారం 6 నెలల లోపు అనుమతి, 100 హెక్టార్లకు పైగా A కేటగిరీ – పబ్లిక్ హియరింగ్ తప్పనిసరి, MoEF నిబంధనల ప్రకారం 9 నెలల లోపు అనుమతులు ఇవ్వాల్సి ఉండగా, ఆచరణలో అవి సమయానికి రావడం లేదని ఆయన పేర్కొన్నారు.

అందువల్ల పర్యావరణ అనుమతులు కూడా మైనింగ్ లీజ్ పీరియడ్ తో సమానంగా ఉండాలని, ఒక సారి అనుమతిస్తే, లీజ్ టైం వరకు వాలిడిటీ ఇవ్వాలని ఎంపీ వద్దిరాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అసలు గ్రానైట్ పరిశ్రమకు పర్యావరణం అనుమతులు అవసరం లేకుండా చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిజానికి 0-5, 0-10, 0-15 హెక్టార్స్ CFE/CFO అవసరం లేదని, ఇవేమీ దుమ్ము లేపే మేజర్ మినరల్ కాదని, పర్మిషన్, ప్రొడక్షన్ ఎంత వస్తుందో, రాదో ఎవరికి కూడా సరైన అంచనా ఉండదన్నారు.వీటికి అవసరమైన అనుమతులిచ్చి మరింత ప్రోత్సహించాలని ఎంపీ రవిచంద్ర కోరారు.
ఈ అంశంలో 1) Director mines and geology – Member Convener and Nodal Officer, 2) PI.C.C.F – member and responsible for the forest clearance under F.C. Act – 1980, 3) CCLA – member and responsible for clearance of revenue (N.O.C. and other related matter including acquisition of lands- under land acquisition act of the respective state, 4) Member and Director / Commissioner of industries – for clearance in setting up an industry, 5. Member and Member Secretary PCB – to clear the EC for all the industries including mining విభాగాలను కలిపి డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసులోనే ఒక ప్రత్యేక సెల్ మాదిరిగా ఏర్పాటు చేయాలని, తద్వారా త్వరితగతిన అనుమతులివ్వాలని ఎంపీ రవిచంద్ర కేంద్ర ప్రభుత్వానికి తన ప్రసంగంలో సూచించారు.