Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ఎంపీ వద్దిరాజు సుడిగాలి పర్యటన

బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సుడిగాలి పర్యటన చేశారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఖమ్మంలోని బుర్హాన్ పురంలో గల తన క్యాంపు కార్యాలయానికి వచ్చిన సందర్శకులతో, అభిమానులతో, పార్టీ కార్యకర్తలతో భేటీ అవుతూనే, మరోవైపు వివిధ కార్యక్రమాల్లో రవిచంద్ర పాల్గొన్నారు.

ఇందులో భాగంగానే తన క్యాంపు కార్యాలయానికి వచ్చిన నూతన వధూవరులు మహేష్- అశ్వితలను ఆశీర్వదించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామస్తులు మర్యాదపూర్వకంగా రవిచంద్రను కలిసి శాలువాతో సత్కరించారు. ఆ తర్వాత తన అభిమాని రేగళ్ల కృష్ణ ప్రసాద్ ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్ లో నూతనంగా ప్రారంభించిన ఫార్మాను సందర్శించారు. ఎంపీ వద్దిరాజుకు కృష్ణ ప్రసాద్ పుష్పగుచ్ఛమిచ్చి సాదర స్వాగతం పలికారు. ఎంపీ వద్దిరాజును శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలోని శివాలయం కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా రవిచంద్రను కలిసి పుష్పగుచ్ఛమిచ్చారు.

అనంతరం వద్దిరాజు రవిచంద్ర మహబూబాబాద్ పట్టణంలో పర్యటించారు ఇక్కడ నిర్మిస్తున్న శ్రీవిఘ్నేశ్వర సహిత అష్టలక్ష్మీ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ నిర్మాణాన్ని పరిశీలించి కమిటీ ప్రముఖులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజును ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి, చిత్రపటాన్ని బహుకరించారు. ఆ తర్వాత నెక్కొండ మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షుడు ఆవుల చంద్రయ్య మాతృమూర్తి సోమక్క దశదిన కర్మకు హాజరై ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అక్కడినుంచి హన్మకొండ జిల్లా పర్యటనకు వెళ్లారు. కాజీపేట మండలం మడికొండలో జరిగిన అన్య, అధీరల నూతన పట్టు వస్త్రాలంకరణ వేడుకల్లో పాల్గొన్నారు.

ఖమ్మంలో ఎంపీ రవిచంద్రను సత్కరిస్తున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వాసులు

ఆయా పర్యటన్లలో ఎంపీ వద్దిరాజు వెంట ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా కాజీపేటలో జరిగిన కార్యక్రమంలో వద్దిరాజుతో కలిసి మాజీ మంత్రి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోజు కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు కే.వాసుదేవరెడ్డి, వై.సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Popular Articles