Top 5 This Week

Related Posts

తమిళనాడులో ఎంపీ ‘వద్దిరాజు’ పర్యటన

రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తమిళనాడులో పర్యటిస్తున్నారు. రవిచంద్ర సహా బీఆర్ఎస్ ప్రముఖులతో కూడిన 40 మంది ప్రతినిధుల బృందం ఈ పర్యటన చేస్తోంది. బీసీల సంక్షేమం, సముద్ధరణకు తమిళనాడులో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల అధ్యయనానికి గాను బృందం గురువారం చెన్నై చేరుకుంది.

ఈ బృందం తమిళనాడు రాష్ట్ర బీసీ,ఏంబీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్ రాజా కుమార్, కమిషనర్ వెంకటేష్ తదితర ఉన్నతాధికారులతో భేటీ అయింది. ఈ సమావేశంలో ఎంపీ రవిచంద్ర, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, మండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జోగు రామన్న, వీ. శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, కోరుకంటి చందర్, పుట్టా మధు, జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వీ. ప్రకాష్, సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు

Popular Articles