రమజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సోమవారం ఖమ్మం నగరంలోని పలువురు ముస్లిం ప్రముఖుల ఇళ్లను సందర్శించి, శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక మున్సిపల్ కార్పొరేటర్లు, ఆత్మీయులు ఎంపీ రవిచంద్రను తమ ఇంటికి స్వాగతించి, కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా రమజాన్ ప్రత్యేక వంటకాలైన షీర్ ఖుర్మా, దహీ వడ, ఖారి సేమ్, డబల్ కా మీఠా వంటివి ఆయనకు వడ్డించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఎంపీ రవిచంద్ర ఆయా ప్రముఖుల ఇళ్లకు వెళ్లినప్పుడు అందరినీ ఆప్యాయంగా పలకరించి, శుభాకాంక్షలు తెలిపి, ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎండీ ఖమర్, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మగ్భూల్, మున్సిపల్ కార్పొరేటర్లు షౌకత్ అలీ, నజీముద్దీన్, శీలంశెట్టి వీరభద్రం, తోట వీరభద్రం, తోట రామారావు, ఎండీ అసద్, ముతహార్, అక్రమ్ అలీ, తౌసిఫ్, ఫజల్, ఆదిల్ పాష, సయ్యద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.