Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

కేంద్ర మంత్రితో ఎంపీ వద్దిరాజు భేటీ

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయ్యారు. ఎంపీ రవిచంద్ర ఢిల్లీలో శుక్రవారం ఉదయం ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి వెళ్లి కొద్ది సేపు సమావేశమయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవలసిందిగా రవిచంద్ర కోరారు. అదేవిధంగా జిల్లాకో నవోదయ పాఠశాలను నెలకొల్పడంలో భాగంగా తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాల్లో కూడా స్కూల్స్ ప్రారంభించాల్సిందిగా ఎంపీ వద్దిరాజు విజ్ఞప్తి చేశారు. రవిచంద్ర వినతులకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించారు.

Popular Articles