రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సోమావరం రైల్వేబోర్డు ఛైర్మెన్ సతీష్ కుమార్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన పలు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, ఇతర సమస్యలపై చర్చించారు. ఢిల్లీలోని రైల్ నిలయంలో జరిగిన ఈ భేటీలో ఎంపీ రవిచంద్ర రైల్వే సమస్యలను ప్రస్తావించారు.
జిల్లాలోని పలు స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు కొత్త ప్లాట్ ఫాం లను విస్తరించడం, కోవిడ్ కు ముందు రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ, అదనపు హాల్టింగ్ లు, కొత్త రైళ్ల మంజూరు వంటి ప్రధాన సమస్యలపై బోర్డు చైర్మన్ తో చర్చించారు. ఎంపీ రవిచంద్ర ప్రస్తావించిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని బోర్డు చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై ఆయన బోర్డు చైర్మన్ కు వినతి పత్రం సమర్పించారు.