Top 5 This Week

Related Posts

దుర్గమ్మ సన్నిధిలో ఎంపీ వద్దిరాజు

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విజయవాడ వెళ్లారు. శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గ అమ్మ వారిని దర్శించుకున్నారు.

ఎంపీ రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీ, కూతురు డాక్టర్ గంగాభవానిలతో కలిసి ఆలయానికి చేరుకోగా అధికారులు, వేద పండితులు పూర్ణకుంభం, మేళతాళాలతో స్వాగతం పలికారు. అమ్మవారి గర్భగుడిలో తమ గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు జరిపించారు.

అనంతరం వేద పండితులు ఎంపీ రవిచంద్రకు, కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు పలికి, అమ్మవారి కుంకుమ ప్రసాదాలను అందించి చిత్రపటాన్ని బహూకరించారు. ఆలయం వద్ద ఎంపీ వద్దిరాజును మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సినీనటులు అశోక్ కుమార్, అనన్య నాగండ్ల తదితర ప్రముఖులు కలిశారు.

Popular Articles