సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు యర్రా శ్రీకాంత్ మరణం పట్ల రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే ఖమ్మం శ్రీనివాసనగర్ లోని ఆయన స్వగృహానికి వెళ్లి శ్రీకాంత్ సతీమణి సుకన్యను, కుమారులను ఓదార్చారు. మృత దేహాన్ని మధురై నుంచి ఖమ్మం తీసుకువచ్చేందుకు జరుగుతున్న ఏర్పాట్ల గురించి కుటుంబ సభ్యులు, సీపీఎం నాయకులను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులను ఓదార్చిన వారిలో బీఆర్ఎస్ పార్టీ కార్పోరేషన్ ఫ్లోర్ లీడర్ కర్నాటక కృష్ణ, కార్పోరేటర్ తోట వీరభద్రం, యర్రా అప్పారావు, వజినేపల్లి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
యర్రా శ్రీకాంత్ కుటుంబానికి ఎంపీ వద్దిరాజు ఓదార్పు
